ఇకపై డైలీ కరోనా బులెటిన్ ఆగిపోనుంది… ఎందుకంటే?

by Anukaran |   ( Updated:2021-02-23 15:31:49.0  )
ఇకపై డైలీ కరోనా బులెటిన్ ఆగిపోనుంది… ఎందుకంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఆఫీస్ ​నుంచి ప్రతీరోజూ విడుదల చేస్తున్న కరోనా బులెటిన్లను నిలిపివేసి, ఇకపైన వారానికి ఒకసారి మాత్రమే విడుదల చేస్తామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. రోజువారీ బులెటిన్‌ తయారీ కోసం పదుల సంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్నారని, ఇకపైన వీరి సేవలను వ్యాక్సినేషన్ కోసం వినియోగించుకుంటున్నట్టు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షలు, కంటైన్‌మెంట్ జోన్లు, యాక్టివ్ కేసులు, డిశ్చార్జి తదితర వివరాలన్నింటినీ బులెటిన్ రూపంలో సుమారు ఏడాది పాటు మీడియా ద్వారా ప్రజలకు చేరవేశామని తెలిపారు. అవసరం ఏర్పడినప్పుడు మళ్లీ రోజు వారీగా కరోనా బులెటిన్​అందుబాటులోకి తెస్తామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed