రఫెల్ నాదల్, మెద్వెదేవ్, జ్వెరెవ్ ముందంజ

by Shiva |
రఫెల్ నాదల్, మెద్వెదేవ్, జ్వెరెవ్ ముందంజ
X

దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ 2021లో అనుకున్నట్లుగానే టాప్ సీడ్ ఆటగాళ్లు దూసుకొని పోతున్నారు. పురుషుల సింగిల్స్‌లో రఫెల్ నదాల్ 6-0, 7-5, 6-2 తేడాతో గ్యాస్కెట్‌పై విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇక వరల్డ్ నెంబర్ 2 డానిల్ మెద్వెదేవ్ 6-4, 6-2, 64 తేడాతో 32వ ర్యాంకర్ రీలీ ఓపెల్కాపై విజయం సాధించి నాలుగో రౌండ్‌లో ప్రవేశించాడు. 6వ సీజ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-2, 7-5, 62 తేడాతో డెరేపై గెలిచి నాలుగో రౌండ్‌కు చేరాడు. 12వ సీడ్ పాబ్లో బుస్టా, 22వ ర్యాంకర్ గారిన్, అన్ సీడెడ్ డెల్బోనిస్, డేవిడోవిచ్ ఫోకినా నాలుగో రౌండ్‌కు చేరారు.

ఇక మహిళల సింగిల్స్‌లో సెరేనా విలియమ్స్ 6-4, 6-4 తేడాతో కోలిన్స్‌ను ఓడించి నాలుగో రౌండ్‌కు చేరుకున్నది. మూడో సీడ్ అర్యాన సబలెంక 31వ ర్యాంకర్ పౌలియూచెక్నోవా చేతిలో 4-6, 6-2, 0-6 తేడాతో ఓడిపోయి మూడో రౌండ్‌లోనే వెనుదిరిగింది. 15 సీజ్ అజరెంకా 6-2, 6-2 తేడాతో 23వ ర్యాంకర్ కీస్‌పై గెలిచి నాలుగో రౌండ్ చేరుకున్నది. వీరితో పాటు రెబకీనా, క్రిస్టియా కూడా నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించారు.

Advertisement

Next Story