- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధాన్యం కొనుగోలులో గోల్‌మాల్.. ఎమ్మెల్యేతో రైతుల భేటీ..
దిశ, ముధోల్ : లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామ రైతులు వడ్ల కొనుగోలు విషయంలో గోల్‌మాల్ జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు ఇంచార్జ్ సర్పంచ్ సాలయి నరేష్ ఈ గోల్‌మాల్‌కు పాల్పడినట్లు గ్రామ రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలోని విశ్రాంతి భవనంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి విన్నవించారు.
ఇదే సమస్యపై నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని.. ఇప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా శుక్రవారం గ్రామంలోని ప్రతీ రైతు ఇంట్లో నుంచి ఒకరు చొప్పున వచ్చి సమస్యలను తెలిపారు. రైతుల వద్ద నుంచి యాసంగి పంట అయిన వరి డీసీఎంఎస్ ద్వారా కొనుగోళ్లు జరిపారు.
తాలు తరుగు పేరిట కొంత ధాన్యం పోగా, మిగతా ధాన్యం డబ్బులు అయినా సరిగ్గా పడతాయి అనుకుంటే డీసీఎంఎస్ ఇంచార్జి నరేశ్ దీంట్లో అవకతవకలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ధాన్యం డబ్బులు కొంత మేరకు తమ బినామీలు, అనుచరులు, బంధువుల అకౌంట్లలో దాదాపు 30 లక్షలపైగా రూపాయలు పక్కదారి పడ్డాయని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ అవకతవకల విషయానికి సంబంధించి నిర్మల్ జిల్లాలో డీ.ఎస్.ఓ ఆఫీస్ నుంచి పూర్తి మొత్తం వడ్ల కొనుగోళ్ల డాటా సేకరించినట్లు, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయంటూ విఠల్ రెడ్డికి తెలియజేశారు.
ఈ విషయంపై విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ వరి కొనుగోళ్ల గురించి పూర్తిగా క్షుణ్ణంగా సంబంధిత అధికారులతో పరిశీలింపచేస్తానని హామీ ఇచ్చారు. శనివారం సంబంధిత అధికారులతో మాట్లాడుతానని, కనకాపూర్ రైతులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.