- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకం పేరిట మోసం
దిశ, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాల పేరిట కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం ఓ వైన్స్ పేరిట సుల్తాన్‌బజార్‌కు చెందిన ఓ వ్యక్తికి క్యూ ఆర్ కోడ్ పంపించిన కేటుగాడు డబ్బులు చెల్లిస్తే 30 నిమిషాల్లో మద్యాన్ని తీసుకువస్తామని మెసేజ్ పంపాడు. ప్రస్తుతం మద్యం అమ్మకాలు లేనందున ఆసక్తి చూపిన ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో రూ.1600 ట్రాన్స్‌ఫర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ కేటుగాడు తక్కువ ధర మద్యం లేదని, స్కాచ్ ఉందని, కావాలంటే మరికొన్ని డబ్బులు కావాలని మెసేజ్ పెట్టాడు. ఇది నిజమేనని నమ్మిన సదరు వ్యక్తి మూడు కేవైసీ నంబర్లను పంపాడు. కొద్దిసేపట్లోనే ఆ దుండగుడు ఆ వ్యక్తి అకౌంట్ నుంచి రూ. 92 వేలు డ్రా చేసుకోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags: Corona Effect, Online Cheating, Alcohol,Cybercrime, Sultan Bazar, Hyderabad