- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోసానికో వెబ్‌సైట్..
దిశ, వెబ్‌డెస్క్ : నేటి రోజుల్లో షాపింగ్ అయినా.. వ్యాపారమైనా అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. ఇంట్లోనే ఉండి బిజినెస్‌లు చేసేస్తున్నారు. ఇలాంటి వారినే టార్గెట్ చేస్తున్నారు కేటుగాళ్లు. అసలును పోలిన నకిలీ వెబ్‌సైట్లను రూపొందించి.. కార్పొరేట్ స్థాయిలో మాట్లాడుతారు. ఎక్కడా అనుమానం రాకుండా వ్యవహరించి.. అందిన కాడికి దోచుకుంటారు. బీహార్ గ్యాంగ్ ఈ మోసాలకు పాల్పడుతోంది.
బిహార్ రాష్ట్రంలోని షెఖాపురా జిల్లా నర్సత్‌పురా గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ అదే గ్రామానికి చెందిన వికాస్, సందీప్‌కుమార్, సోనుకుమార్‌తో కలిసి ఓ గ్యాంగ్‌ను ఏర్పా టు చేశాడు. ప్రముఖ కంపెనీలకు చెందిన వెబ్‌సైట్లను కాపీ కొడుతూ నకిలీ వెబ్‌సైట్లను క్రియోట్ చేశాడు. ఇలా హల్దిరామ్, ఎస్బీఐ పాయంట్స్ తో సహా పలు నకిలీ వెబ్‌సైట్లను రూపొందించాడు. వారికి ఆ కంపెనీ డీలర్ షిప్ ఇప్పిస్తామని ఆ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇస్తారు.
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని శాలిబండకు చెందిన ఓ వ్యక్తి 2020 నవంబర్‌లో హల్దిరామ్ డీలర్ షీప్ కోసం వెబ్‌సైట్ లో వెతకగా.. రాహుల్ కుమార్ గ్యాంగ్ లైన్ లోకి వచ్చింది. నేను హల్దిరామ్ మేనేజర్ ఆశీష్‌కుమార్‌ను.. హల్దిరామ్ ఫుడ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నాం.. మీరు ఏజెన్సీ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే డిస్ట్రిబ్యూషన్‌కు రూ.10 లక్షలు డిపాజిట్ చేయండి అంటూ గుర్తు తెలియని వ్యక్తి సూచించారు. అయితే తాను అంత డిపాజిట్ చేయలేనంటూ హైదరాబాద్ వ్యాపారి చెప్పారు. దీంతో మా బాస్‌తో మాట్లాడంటూ రవికుమార్ అనే పేరున్న వ్యక్తితో మాట్లాడించారు. ఆయన ఏజెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ సూచిస్తూ రూ.25 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ పేమెంట్, అగ్రిమెంట్ ఫీ, స్టాక్‌కు సంబంధించిన అడ్వాన్స్ డిపాజిట్ అంటూ రూ. 21.60 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసం చేశారని గ్రహించాడు. బాధితుడు ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
నిందితులు వ్యాపారి నుంచి వసూలు చేసిన డబ్బులను మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయించారు. ఆ సొమ్మును అందరూ పంచుకున్నారు. సైబర్‌క్రైమ్స్ పోలీసులు బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడైన రాహుల్ కుమార్‌ను బీహార్‌లో అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి సోమవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించి రిమాండ్‌కు తరలించారు.