- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాలర్ల మార్పిడి పేరిట దగా.. నలుగురు అరెస్టు
దిశ, క్రైమ్: అమెరికా డాలర్ల మార్పిడి పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పలువురు జీవనోపాధి కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లి కూలీలుగా పనిచేశారు. అయినా కష్టాలు తీరకపోవడంతో యూఎస్ డాలర్లను భారత కరెన్సీలోకి మార్చి ఇస్తామని చెబుతూ మోసాలకు పాల్పడేందుకు సిద్ధమయ్యారు. 8 వేల యూఎస్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో రూ.5 లక్షల విలువ చేస్తుందని, అత్యవసరాల రీత్యా రూ.4 లక్షలకే ఇస్తామని చెబుతూ అమాయకులను మోసగిస్తున్నారు.
ముందుగా నమ్మించేందుకు 20 యూఎస్ ఒరిజినల్ డాలర్లను అందిస్తారు. తర్వాత మిగతా డాలర్ల మొత్తాన్ని పైకి కన్పించేలా డాలర్లను ఉంచి లోపల న్యూస్ పేపర్ కటింగ్స్ ఉంచుతూ మోసగిస్తున్నారు. సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెయిన్ బజార్‌లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.2.80 లక్షల ఇండియన్ కరెన్సీ, 20 యూఎస్ డాలర్లు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం రెయిన్ బజార్ పోలీసులకు అప్పగించినట్టు టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపారు.