సల్మాన్ ఖాన్ పై చీటింగ్ కేసు.. పెట్టిందెవరంటే..?

by Shyam |   ( Updated:2021-07-09 00:32:00.0  )
salmankhan news
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమి కాదు. అది మంచైనా, చెడైనా తరచూ వార్తల్లో నిలవడం ఆయన ప్రత్యేకత. తాజాగా మరోసారి సల్మాన్ చిక్కుల్లో పడ్డాడు. అతడి మీదా అతడి సోదరి అల్విరా ఖాన్ హోత్రిపైనా చీటింగ్ కేసు నమోదైంది. చండీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

2018 లో సల్మాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్ హోత్రి ‘బీయింగ్ హ్యూమన్ జువెలరీ’ బ్రాండ్ స్టోర్‌కు అవసరమైన సహాయ సహకారాలతోపాటు దానికి ప్రచారం కూడా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని అరుణ్ గుప్తా అనే వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. తాను రూ.3 కోట్లతో బీయింగ్ హ్యూమన్ షోరూంను ప్రారంభించానని.. ఢిల్లీ నుంచి తనకు రావాల్సిన వస్త్రాలు రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కు సంబంధించిన వెబ్ సైట్ కూడా పని చేయటం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ పై, ఆయన సోదరి అల్విరా.. సంస్థ సీఈవో ప్రకాశ్ కాపరేతో పాటు మరో ఏడుగురిపైనా కేసు నమోదు చేసి సమన్లు పంపామని, విచారణ కోసం ఈ నెల 13న తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed