రాయచోటిలో మకాం.. 13ఆలయాల్లో చోరీ

దిశ, వెబ్‌డెస్క్: ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి, అనంతపురం జిల్లాకు చెందిన నలుగురు దొంగలు రాయచోటిలో మకాం వేసి జిల్లాలోని సుండుపల్లె, రామాపురం, వీరబల్లి, సంబేపల్లె, చక్రాయపేట, చిన్నమండెం, పెండ్లిమర్రిలోని 13ఆలయాల్లో బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ప్రాచీన ఆలయాల్లో రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.4.20లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు, రూ.6వేల నగదు, 3బైక్‌లు, అమ్మవారి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement