- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులపై దాడి
by Shamantha N |
X
దిశ, ముంబయి: కరోనా కారణంగా హోలా మొహల్లా వేడుకలకు అనుమతినివ్వని పోలీసులపై గురుద్వార ఎదుటే దాడి జరిగింది. మహారాష్ట్ర నాందేడ్‌లో జరిగిన ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ కేసులో 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రతియేటా సిక్కులు మార్షల్ స్కిల్స్ ప్రదర్శించే హోలా మొహల్లా వేడుకలకు కరోనా కారణంగా పోలీసులు అనుమతినివ్వలేదు. ఇందుకు గురుద్వారా కూడా సమ్మతించింది. కానీ, సోమవారం నాలుగు గంటల సమయంలో 17 మందికిపైగా ఉన్న ఓ గుంపు కర్రలు, కత్తులతో హఠాత్తుగా గురుద్వార నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి బారికేడ్లను తోసిపారేసింది. పోలీసులపై దాడి చేసింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని, గాయపడ్డ నలుగురు పోలీసులకూ ప్రాణాపాయం లేదని రాష్ట్ర డీజీపీ రజనీశ్ సేథ్ వెల్లడించారు.
Advertisement
Next Story