మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సస్పెన్షన్

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లా ల్యాండ్ ఇష్యూలో రూ.కోటి 12లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కేసులో నలుగురు అధికారులపై వేటు పడింది. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ అహ్మద్‌ను సస్పెండ్ చేస్తూ బుధవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న అడిషనల్ కలెక్టర్‌తో పాటు మరో నలుగురి నిందితులను 4రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈనెల 21నుంచి 24 వరకు విచారించనున్నారు.

Advertisement