- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐడీ కార్డు, ఫోన్ విసిరికొట్టి.. కానిస్టేబుల్‌పై దాడి
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పటాన్‌చెరులో నలుగురు వ్యక్తులు కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. పటాన్‌చెరు నోవాపాన్ చౌరస్తాలో బాచుపల్లి కానిస్టేబుల్ కనకయ్యపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు.
తాను పోలీసు కానిస్టేబుల్‌ను అని చెబుతున్నా వినకుండా పోలీస్ ఐడీ కార్డు, అతడి ఫోన్‌ను విసిరికొట్టి వారు దాడికి పాల్పడ్డారు. అయితే ఓ కేసు విషయంలో దేవీలాల్ అనే వ్యక్తిని కనకయ్య అదుపులోకి తీసుకోడానికి వెళ్లగా ఈ దాడి జరిగింది. ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసుకుని దేవీలాల్‌లో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story