మోహన్‌బాబు ఫాంహౌస్‌ వద్ద కలకలం

దిశ, క్రైమ్‌బ్యూరో: ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద శనివారం సాయంత్రం కలకలం రేగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద ప్రధాన గేటు తెరిచి ఉంది. సరిగ్గా అదే సమయంలో రోడ్డుపై అటుగా వచ్చిన ఏపీ 31 ఏఎన్ 0004 ఇన్నోవా కారు ఒక్కసారిగా గేటు లోపలికి వెళ్లి ఖాళీ ఆవరణలోనే కారును వెనక్కు తిప్పుకొని వెళ్లిపోయారు. ఈ సమయంలో నలుగురు దుండగులు.. మిమ్ములను వదలమంటూ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఫాంహౌస్‌లో ఉన్న మోహన్‌బాబు, బంధువులు భయాందోళనకు గురై, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫాం హౌస్ కు ప్రధాన గేటు ఒక్కటే ఉన్నందున టూ వీలర్ వెళ్లేందుకు వాచ్ మెన్ గేటు తెరిచినట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు.

Advertisement