- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విహారయాత్ర నింపిన విషాదం.. సరదాగా చెరువులోకి!

X
దిశ, వెబ్‌డెస్క్ : కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని గండిమడుగులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి నలుగురు గల్లంతయ్యారు. వీరంతా బెంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విహార యాత్రకోసం బెంగళూరు నుంచి 10 మంది చిత్తూరు జిల్లా వాల్మీకి పురంలోని బంధువుల ఇంటికి వచ్చారు.
బంధువులతో కలిసి మెుత్తం 20 మంది గండిమడుగులో సరదాగా ఈతకొట్టేందుకు ప్రయత్నించారు. ఈత కొడుతుండగా నలుగురు గల్లంతయ్యారు. గల్లైంతన వారు తాజ్ మహ్మద్(40), మహ్మద్ హంజా(12), ఉస్మాన్ ఖానమ్(11), మహ్మద్ హఫీజ్(10)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన లక్కిరెడ్డి పల్లి సీఐ యుగంధర్ వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story