- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉలిక్కిపడ్డ మిడ్జిల్.. ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా
దిశ, జడ్చర్ల : మిడ్జిల్ మండల కేంద్రంలో ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది. సోమవారం ఈ విషయం బయటకు తెలియడంతో మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గత మూడు నెలలుగా మండలంలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాకపోవడంతో ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ, ఒకే కుటుంబంలోని దంపతులతో పాటు వారి కుమారుడు, అదే కుటుంబంలోని మరో చిన్నారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు పీహెచ్సీ కేంద్రంలోని వైద్యులు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ శశికాంత్, డీఎం విజయ్ కుమార్, సోమవారం బాధితుల ఇంటికి చేరుకుని కొవిడ్ నివారణకు తీసుకోవలసిన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, తప్పనిసరిగా మాస్కు ధరించి కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. మిడ్జిల్ కథానికా ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ పరీక్షలు చేస్తు్న్నామని లక్షణాలు ఉన్నవారు వచ్చి టెస్టులు చేయించుకోవాలన్నారు.ఆయన వెంట మండల వైద్యాధికారి ఓం శ్రీ ప్రియ, సిబ్బంది దేవయ్య జంగయ్యతో పాటు ఆశా కార్యకర్తలు ఉన్నారు.