రూ.59 కోట్లతో నాలుగు లేన్ల రైల్వే అండర్​ బ్రిడ్డి

by  |
రూ.59 కోట్లతో నాలుగు లేన్ల రైల్వే అండర్​ బ్రిడ్డి
X

దిశ, న్యూస్​బ్యూరో: హైటెక్ సిటీ – కూక‌ట్‌ప‌ల్లి మార్గంలో ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవ‌ర్ పై ఒత్తిడిని త‌గ్గించేందుకు ఎంఎంటీఎస్​ రైల్వేస్టేష‌న్ స‌మీపంలో నాలుగు లేన్ల రైల్వే అండ‌ర్ బ్రిడ్జితో పాటు స్టార్మ్ వాట‌ర్ డ్రెయిన్‌ను నిర్మిస్తున్నట్లు జీహెచ్​ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ గురువారం ఓ ప్రక‌ట‌న‌లో తెలిపారు. ఈ ప‌నుల‌కు ఎస్​ఆర్​డీపీ కింద రూ. 59.09 కోట్ల నిధుల‌ను మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. ట్రాఫిక్‌తో పాటు డ్రైనేజీ స‌మ‌స్యను ప‌రిష్కరించేందుకు ఈ ప‌నులు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేర‌కు ర‌ద్దీ ప్రాంతాల్లో ఒత్తిడిని త‌గ్గించేందుకు ఈ ప‌నులు చేప‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు. ఇందులో రైల్వే అండ‌ర్ బ్రిడ్జి ప‌నుల‌కు రూ. 24.09 కోట్లు, రెండు వైపులా అప్రోచ్ రోడ్లు, స్టార్మ్ వాట‌ర్ డ్రెయిన్ నిర్మాణం, క‌ల్వర్ట్ విస్తర‌ణ ప‌నుల‌కు రూ. 35కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు. ఇందూ ఫార్చూన్ అపార్ట్‌మెంట్ ఎదురుగా బ్రిడ్జి నెం-215 వ‌ద్ద ప్రస్తుతమున్న రెండు లేన్లపైప్ క‌ల్వర్ట్‌ను నాలుగు లేన్లుగా వెడ‌ల్పు చేసిన‌ట్లు తెలిపారు. వ‌ర‌ద నివార‌ణ చ‌ర్యల్లో భాగంగా 250 మీట‌ర్ల పొడ‌వున ఆర్‌సిసి బాక్స్ డ్రెయిన్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. రైల్వే అండ‌ర్ బ్రిడ్జి ప‌నుల‌ను వేగంగా పూర్తి చేసేందుకు రైల్వే ఇంజ‌నీరింగ్ విభాగంతో, జీహెచ్​ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం ఇంజ‌నీరింగ్ అధికారులు స‌మ‌న్వయంతో ప‌నిచేస్తున్నట్లు క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed