విషాదం.. నీటికుంటలో పడి నలుగురు మృతి

by srinivas |
విషాదం.. నీటికుంటలో పడి నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం కుప్పం మండలం కృష్ణదాసరిపల్లి పంచాయతీ చింపగల్లు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కీర్తి అనే ఆరేళ్ల చిన్నారి నీటికుంటలో బట్టలు ఉతికేందుకు వెళ్లి జారిపడగా.. కాపాడేందుకు యత్నించిన కీర్తి అక్క హారతి (7) కూడా మునిగిపోయింది. గమనించిన తల్లి రుక్మిణి(32) కుమార్తెలను కాపాడేప్రయత్నంలో ఈతరాక మునిపోయింది. ఇదేక్రమంలో రుక్మిణి బంధువు గౌరమ్మ (42)కూడా నీటికుంటలోకి దిగి మునిగిపోయింది. ఒకరిని కాపాడేప్రయత్నంలో మరొకరు ప్రయత్నంచి నలుగురు చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed