బస్టాండ్‌లో నలుగురు కరోనా అనుమానితులు

by vinod kumar |   ( Updated:2020-05-30 03:04:18.0  )
బస్టాండ్‌లో నలుగురు కరోనా అనుమానితులు
X

దిశ, మహబూబ్‌నగర్: జిల్లాలో కరోనా కలకలం మరోసారి మొదలైంది. శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో నిర్వహించిన స్క్రినింగ్‌లో నలుగురు అనుమానితులను గుర్తించారు. వెంటనే బస్ స్టాండ్‌ను ఖాళీ చేయించి.. వారిని హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరు గ్రామంలో కరోనా కలకలం రేపింది. రాఘవేందర్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహింస్తుంటాడు. సూగూరు గ్రామానికి మూడు రోజుల క్రితం తల్లిదండ్రులను చూడడానికి వచ్చాడు. ఇంతలోనే అతనికి హైదరాబాద్ నుంచి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం అందడంతో అతను తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. విషయం తెలుసుకున్న పెబ్బేరు డాక్టర్ల బృందం సూగూరు గ్రామంలో వివరాలు సేకరిస్తున్నది. తల్లిదండ్రులను క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించే అవకాశం ఉంది. శనివారం ఉదయమే ఉప్పునుంతల మండలానికి చెందిన 55 రోజుల బాలుడు మృత్యువాత పడడం, వేపురులో ఓ వ్యక్తికి కరోనా సోకడం జిల్లాలో కలకలం రేపుతోంది. ఒకే రోజు సుమారు 6 అనుమానిత కేసులు బయటపడడంకో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Advertisement

Next Story