ఇంట్లో ప్రియుడే కాదు మరో ఇద్దరితోనూ.. ఆ శబ్ధం రావడంతో..

by Sumithra |   ( Updated:2021-12-20 22:58:38.0  )
Rape-1
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిని నమ్మి ఇంట్లోకి వచ్చిన ప్రియురాలిపై తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. దీంతో ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి తమిళనాడులోని నామక్కల్ వేప్పేడులో ఉన్న ఓ మిల్లులో పని చేస్తోంది. దీంతో అక్కడే పని చేసే ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమెను ఎలాగైనా లొంగతీసుకోవాలని ప్లాన్ వేశాడు. తన ఇంటికి రమ్మని ఆ యువతిని పిలిచాడు. అతడి మాటలు నమ్మి ఆ యువతి అతని ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అనుమానం వచ్చి అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ యువతిని అడ్డుకుని ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాదు.. అతని స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో ఆ యువతి స్పృహ కోల్పోయింది. అర్ధరాత్రి సమయంలో స్పృహలోకి వచ్చింది. భయపడుతూ ఆ ఇంట్లో గట్టిగా కేకలు వేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

స్నానానికి వెళ్లి వస్తా అన్న కూతురు.. బాత్ రూమ్‌లో చేసిన పనికి షాక్ అయిన తల్లిదండ్రులు

Advertisement

Next Story