పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో 70 శాతం వారే ఉన్నారు..

by Shyam |
limbadri
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మహిళా సాధికారత ఎక్కువగా ఉందని, పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో 70శాతం వారే ఉన్నారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో సోమవారం స్థాపన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగం మొత్తం ఇంజినీరింగ్, ఐటీ చుట్టూ తిరుగుతోందన్నారు. విద్యాసంస్థలు దృక్కోణ ప్రణాళికను అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి వైపు సమాజాన్ని శక్తివంతం చేసే మార్గాన్ని కనుగొనడానికి సలహా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అకాడమీలకు, సమాజానికి మధ్య చాలా అంతరం ఉందని దానిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.

ఆన్‌లైన్ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ ఆదరణ లభించలేదని.. కాని కరోనాతో విద్యార్థులు మక్కువ చూపారన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ప్రవేశ ప్రక్రియను నిర్వహించడం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం, డోర్ స్టెప్ నుండే సర్టిఫికేట్‌లను డౌన్‌లోడ్ చేయడం వంటి అనేక మార్గాల్లో సహాయపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ కె. జయశంకర్, బ్రహ్మారెడ్డి, జి వెంకట సుబ్బయ్య, సీతా రాంబాబు, సుబ్బి రెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రమణ నాయక్ బానోతు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed