అతిపురాతన డైనోసార్ శిలాజం.. గుర్తించిన శాస్త్రవేత్తలు

by Sujitha Rachapalli |
అతిపురాతన డైనోసార్ శిలాజం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : భూమిపై మానవాళి కంటే ముందు రాక్షసబల్లులు(డైనోసార్స్) జీవించాయని, కాలక్రమంలో అవి అంతర్థానమయ్యాయని చరిత్ర చెబుతుండగా.. అవి ఎలా అంతమయ్యాయి? ఎక్కడ జీవించి ఉండేవి? అనే విషయాలపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా అర్జెంటీనాలోని నిక్వెన్ సిటీలో శాస్త్రవేత్తలు అతిపురాతన డైనోసార్ శిలాజాన్ని కనుగొన్నారు. పటగొనియన్ అరణ్యంలో లభ్యమైన ఈ శిలాజం అతి పురాతన డైనోసార్ టైటానోసార్స్ (Titanosaurs) అసంపూర్ణ అస్తిపంజరం అని భావిస్తున్నారు.

ఇవి భూమిపై నివసించిన అతిపెద్ద రాక్షసబల్లులని, నింజటైటన్ జపటై(Ninjatitan zapatai) జాతికి చెందిన వీటికి అతి పెద్ద మెడ ఉంటుందని, నాలుగు పెద్ద కాళ్లతో నడిచే ఈ జీవులు అతి భయంకరంగా ఉండేవని వారు చెప్తున్నారు. ప్రపంచంలో పలు చోట్ల లభించిన టైటానోసార్స్ శిలాజాల్లో ఇది అతిపురాతనమైనదని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఆఫ్ అర్జెంటినా(CONICET)’ సైంటిస్ట్ పాబ్లో గలీనా వెల్లడించారు. 65 ఫీట్ల పొడవుండే ఈ టైటానోసార్స్ దక్షిణ ధ్రువాల్లోనే జీవించే ఉండేవని అనుకుంటుండగా, ఈ సైంటిఫిక్ స్టడీ పూర్తి వివరాలు సైన్స్ జర్నల్ అమెంఘినియాన(Amenghiniana)‌లో ప్రచురితమైనట్లు రీసెర్చర్స్ తెలిపారు.

Advertisement

Next Story