- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆసిస్‌పై ఇండియా గెలవాలి : పాకిస్తాన్ మాజీ బౌలర్
దిశ, వెబ్‌డెస్క్: సమయం వచ్చినప్పుడల్లా టీమిండియాపై విమర్శలు గుప్పించే పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ లేనంతగా భారత జట్టుపై ప్రశంసలు గుప్పించాడు. ఇటీవలే ఆడిలైడ్ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా విఫలం చెందిన టీమిండియా బాక్సింగ్ డే టెస్టులో కనబర్చిన ఆటతీరు అమోఘమని కొనియాడాడు. తాత్కాలిక కెప్టెన్ రహనే సెంచరీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని చెప్పుకొచ్చాడు. రహనే కెప్టెన్సీలో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారని తెలిపారు. అలాగే ఈ సిరీస్‌లో ఇండియా గెలుపొందాలని కోరుకుంటున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత 10-15 ఏళ్ల కిందట ఆసియా జట్లు ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలయిస్తామని అనుకోలేదని, కానీ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ సిరీస్‌లో ఇండియా గెలవాలని కోరుకుంటున్నానని, భారత్ అద్భుతంగా పుంజుకుందన్నాడు.