ప్రభుత్వంపై మాజీ ఎంపీ తమ్మినేని ఫైర్

by  |
ప్రభుత్వంపై మాజీ ఎంపీ తమ్మినేని ఫైర్
X

దిశ, ముషీరాబాద్: రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీలను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. గురువారం దీక్షను మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా తీసుకు వస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీ లను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసి కార్పొరేట్ శక్తులకు ఉన్నత విద్యను కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పి, ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకువచ్చి ఉచిత విద్యను అందరికీ ఎలా అందిస్తారని అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోవడం అంటే పేద వర్గాలను విద్యకు దూరం చేయడమేనని స్పష్టమవుతోందన్నారు. నూతన విద్యా విధానం పేరుతో కేంద్రం విద్యను విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టేందుకు కుట్ర చేస్తోందన్నారు. విద్య, వైద్య పారిశ్రామిక రంగాలతో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని అని ఆయన పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మూర్తి, నాగరాజు మాట్లాడుతూ… పేద వర్గాలకు విద్యను దూరం చేసి ఇ కేవలం డబ్బు ఉన్న ధనికులకు మాత్రమే చదువుకునే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం విద్యావకాశాలు తగ్గుతుంటే ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని, ప్రభుత్వం స్పందించి ఇంతవరకు ఉద్యమిస్తామని అన్నారు. పలు సంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటించారు.


Next Story

Most Viewed