ఆ కుటుంబాలకు అండగా ఉంటా : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

by Sridhar Babu |
Former MP Ponguleti Srinivas Reddy
X

దిశ, మణుగూరు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో పర్యటించారు. ఇటీవల కరోనాతో మరణించిన భవాని శంకర్‌ కుమారుడు రవి ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం అశ్వాపురం మండలంలోని మిట్టగూడెం గ్రామంలో టీఆర్ఎస్‌ నాయకులు కర్రీ శ్రీను కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. అలాగే జగ్గారం గ్రామంలో పర్యటించి మాదినేని రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

అనంతరం నెల్లిపాక సొసైటీ చైర్మన్ తుక్కని మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని మొండికుంట గ్రామంలో పరామర్శించారు. అక్కడి నుండి బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో చిన్న కోటిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ పర్యటనలో పొంగులేటితో పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ తుళ్లూరి బ్రహ్మయ్య, బూర్గంపహాడ్ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత రెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story