జేసీ దివాకర్ సంచలన వ్యాఖ్యలు.. డబ్బిస్తేనే ప్రజలు ఓట్లేస్తారు

by srinivas |
Former MP JC Diwakar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఎంత సేవ చేసినా గుర్తించడం లేదని, డబ్బు ఇస్తేనే గెలిపిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు డబ్బులు పంచలేదని, అందకే ఓడిపోయాడని అన్నారు. టీడీపీ, వైసీపీ మధ్య ఎన్నికలు జరిగాయనుకుంటున్నారని అది తప్పు అని.. చంద్రబాబు జగన్‌ను చూసి ప్రజలు ఓట్లు వేయలేదని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా ఇలానే జరుగుతాయని వెల్లడించారు.



Next Story

Most Viewed