- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లు కల్వకుంట్ల కుటుంబానికి బానిసలు
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, రాజకీయం చేస్తున్నామని అనడం దారుణం అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులుగా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీమీద లేదా అని ఆయన స్థానిక జిల్లా మంత్రులను ప్రశ్నించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా ఉన్నారు. తప్ప ప్రజలకు మేలు చేసేందుకు కాదని ఆయన విమర్శించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా నీటిని దోచుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సమంజసం కాదని ఆయన అన్నారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాలకు చెందిన భూములు ఎడారులుగా మారడం ఖాయమని, ఈ విషయమై జిల్లాకు చెందిన మంత్రులు ఒత్తిడి చేయకపోవడం తమ చేతగాని తనానికి నిదర్శనం అని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా విషయమై జిల్లా మంత్రులు గానీ, సీఎం కేసీఆర్ గానీ ఏనాడూ కూడా సమీక్ష నిర్వహించింది లేదని అన్నారు. ఇది వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.