కాంగ్రెస్ పార్టీపై కూన శ్రీశైలం సంచలన ఆరోపణలు

by Shyam |   ( Updated:2021-02-21 10:00:43.0  )
Kuna Srisailam Gowd
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ మారిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఏర్పడిన కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొందానన్నారు. తదనంతరం ఓటమి పాలైనా నిత్యం ప్రజలతో ఉన్నానన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినా కొత్త వారిని నియమించకుండా అధిష్ఠానం తాత్సారం చేయడంతో పార్టీ క్యాడర్ పూర్తిగా దెబ్బతిందన్నారు. ప్రజలు, కార్యకర్తలు సూచన మేరకు బీజేపీలో చేరినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని గుర్తించానని, ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీకి బీజేపీయే గట్టి పోటీగా నిలుస్తున్నదన్నారు.



Next Story

Most Viewed