- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
దిశ, మిర్యాలగూడ: పోతిరెడ్డిపాడు విషయంలో ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మిర్యాలగూడ సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఆశాజనకంగా నీరు నిల్వ ఉందని అదే స్థాయిలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని, ఇప్పటికే ఆయకట్టులో వరి నారు పోసుకుని నీటి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. తక్షణమే నీటిని విడుదల షెడ్యూల్‌ను ప్రకటించి ఆగస్టు మొదటి వారంలో నీరు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు అవసరమైన ఎరువులు యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుపై ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల నాయకుల అభిప్రాయాలను సేకరించి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.