- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ! విజయమ్మకు షోకాజ్ నోటీసులివ్వండి : గోనె ప్రకాష్‌రావు
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో నాతో వైఎస్‌ఆర్’ పుస్తకంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆ పుస్తకంలోని 172వ పేజీలో తప్పులు రాశారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ఆర్ పాదయాత్రలో సంఘీభావంగా జగన్ ఉన్నారని విజయమ్మ అబద్దాలు రాశారన్నారు. అది తప్పుల తడక అని వ్యాఖ్యానించారు. వైఎస్ పాదయాత్ర జరిగినన్ని రోజులు అంబటి, లగడపాటి, భూమన కరుణాకర్ రెడ్డి, సుధీర్‌రెడ్డిలు మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు.
జగన్ ఎక్కడా వైఎస్ పాదయాత్రలో పాల్గొనలేదన్నారు. అది నిజమని నిరూపిస్తే తిరుపతిలో ఉరేసుకుంటా అంటూ వైఎస్ఆర్, జగన్ అభిమానులకు గోనె సవాల్ విసిరారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉండి షర్మిల దీక్షకు ఎలా మద్దతు తెలుపుతారని విజయమ్మను ప్రశ్నించారు. ప్రత్యక్షంగా దీక్షలో ఎలా పాల్గొంటారన్నారు. వైఎస్ విజమ్మకు, వైఎస్ జగన్ ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వలేదని గోనె ప్రకాష్‌రావు నిలదీశారు.