- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధనదాహం ఎక్కువైంది.. బాబుమోహన్ ఫైర్
దిశ ప్రతినిధి, మేడ్చల్:
ధనదాహం ఎక్కువై నాసిరకం ప్రాజెక్టులతో దోచుకుంటున్నారని సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ ప్రభుత్వాని విమర్శించారు. మేడ్చల్ జిల్లా, మేడిపల్లిలో ఆదివారం బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబు మోహన్ మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి అంటూ ఉచిత హామీలు ఇచ్చి టీఆర్ఎస్ దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
దళితులని ఓటు బ్యాంకింగ్ గానే చూస్తున్నారు తప్ప, వారికి ఇస్తున్న హామీలు ఇవ్వకపోగా వారికి ఉన్న భూమిని లాకొన్ని వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని వ్యాఖ్యానించారు. కరోనా రోగులు ఆక్సిజన్ అందక ఏంతో మంది చనిపోతున్నారు. సామాన్య ప్రజలే కాదు ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు వారి కుటుంబ సభ్యులు ఎంతో మంది సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని తెలియజేశారు. ఇప్పటికైనా దళితులకు ఇస్తానని చెపిన్నట్టుగా మూడెకరాల భూమిని ఇవ్వాలన్నారు. కరోనా రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.