మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్యం విషమం

by Anukaran |   ( Updated:2021-04-18 01:39:37.0  )
Motkupalli Narsimhalu
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీమంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్యం విషమంగా మారింది. కొద్దిరోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. అప్పటి నుండి కరోనా చికిత్స పొందుతున్న ఆయనకు శనివారం అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఏర్పడ్డాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. మోత్కుపల్లి హెల్త్ కండీషన్ సీరియస్‌గా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

Next Story

Most Viewed