కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌తో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కన్నుమూశారు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తోడవ్వడంతో వైద్యులు ఎన్నిప్రయత్నాలు చేసిన ఫలితం దక్కలేదు. మాతంగి నర్సయ్య సతీమణి భోజమ్మ ఇటీవల చనిపోయారు. వారంరోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మాతంగి నర్సయ్య టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసి రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement