మంత్రి అయిన ఫొటో గ్రాఫర్.. కరోనాతో మృతి

by  |
మంత్రి అయిన ఫొటో గ్రాఫర్.. కరోనాతో మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అతను ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. చిన్నతనం నుంచి ఫొటోగ్రఫిపై ఉన్న మక్కువతో ఫొటో గ్రాఫర్‌గా కేరీర్ ప్రారంభించాడు. అలా జిల్లాలోనే పేరుగాంచిన ఫొటో గ్రాఫర్‌గా పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఆ తర్వాత రాజకీయ ఆరంగ్రేటం చేసి రాష్ట్రంలో పేరొందిన నేతల్లో ఒకరిగా మారారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలిసారే మంత్రి పదవిని చేపట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇంతకు అతను ఎవరు అనుకుంటున్నారా… మృదు స్వభావి, అజాత శత్రువు అయిన పైడికొండల మాణిక్యాల రావు.

మాణిఖ్యాలరావు 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోకజవర్గం నుంచి తొలిసారిగా బీజేపీ నుంచి గెలుపొందారు. ఆ సమయంలో బీజేపీ టీడీపీతో మిత్రపక్షంగా ఉండటంతో మాణిక్యాలరావుకు దేవాదాయ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. ఆయన ఆ పదవిలో 2014 నుంచి 2018 వరకు కొనసాగారు. కాగా, మాణిక్యాలరావుకు నెల రోజుల కిందట కరోనా పాజిటివ్ రావడంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఫొటో‌గ్రాఫర్‌గా కేరీర్ ప్రారంభించి.. మంత్రిగా ఆయన ఎదిగిన తీరును ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారు.


Next Story

Most Viewed