మాణిక్యాలరావు అంత్యక్రియలు పూర్తి

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో మృతి చెందిన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు శనివారం రాత్రి ముగిశాయి. ఆయన స్వగ్రామం తాడేపల్లిగూడెంలోని మానవతా శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కేవలం 20 మందికే అనుమతి ఉండటంతో కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీనికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కార్యక్రమాన్ని డీఎస్పీ కె.రాజేశ్వర రెడ్డి, ఆర్డీవో రచన, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి దగ్గరుండి పర్యవేక్షించారు.

Advertisement