టీఆర్ఎస్‌కు షాకిచ్చిన కరీంనగర్ మాజీ మేయర్.. ఎమ్మెల్సీ పోరుకు రెడీ

by Sridhar Babu |
టీఆర్ఎస్‌కు షాకిచ్చిన కరీంనగర్ మాజీ మేయర్.. ఎమ్మెల్సీ పోరుకు రెడీ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అధికార టీఆర్ఎస్ పార్టీకి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఝలక్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించి భంగపడ్డ రవీందర్ సింగ్ అనూహ్యంగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ వేస్తారా లేదా అన్న చర్చ సాగుతున్న క్రమంలో చివరకు పోటీ చేసేందుకు మొగ్గు చూపడం టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ముఖ్య నాయకులు ఆయనతో చర్చిస్తే మనసు మార్చుకునే అవకాశాలు లేకపోలేదు.


Next Story

Most Viewed