నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఆత్మహత్య..

by Sridhar Babu |
నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఆత్మహత్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు దీర్ఘకాలిక, మానసిక, ఆర్థిక సమస్యల వలన బలవన్మరణాలకు పాల్పడుతుంటే మరికొందరు చిన్నచిన్న విషయాలకే ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.

నీటిపారుదల శాఖ మాజీ ఎస్‌ఈగా పనిచేసిన కోటగిరి శ్రీనాథ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపగా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కాగా, శ్రీనాథ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Next Story