కోహ్లీని సూర్యకుమార్ పట్టించుకోలేదు : సెహ్వాగ్

by Anukaran |
కోహ్లీని సూర్యకుమార్ పట్టించుకోలేదు : సెహ్వాగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2020లో భాగంగా బుధవారం రాత్రి అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌ల మధ్య కవ్వింపు చర్యలు చోటుచేసుకున్నాయి. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.

‘విరాట్ కోహ్లీకి సూర్యకుమార్ యాదవ్ తన సత్తా ఏంటో చూపించాడు. ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయకపోవడాన్ని కూడా పట్టించుకోకుండా రెచ్చిపోయాడు. సూర్యను రెచ్చగొట్టేందుకు విరాట్ యత్నించినా.. అతను పట్టించుకోలేదు. వాటికి భయపడే రకాన్ని కాదనే విషయాన్ని తన బ్యాట్ నిరూపించాడు.’ అని సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Advertisement

Next Story