కేసీఆర్‌ను తప్పుబట్టిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే

by Shyam |
కేసీఆర్‌ను తప్పుబట్టిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ విషయంలో ప్రధాని మోడీకి లేఖ రాసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తప్పుబట్టారు. రాష్ట్రాల ముందు కేంద్రం రెండు ప్రతిపాదనలు ఉంచిందని, కేసీఆర్ వాటిని అధ్యయం చేసి ఒకదానికి ఆమోదం తెలిపితే బాగుండేదని వ్యాఖ్యానించారు. గతంలో ఆర్థికమంత్రిగా ఉన్న ఈటల జీఎస్టీ సమావేశాల్లో బిల్లును ప్రశంసించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే జీఎస్టీని అడ్డుపెట్టుకొని ప్రధాని మోడీపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. ప్రధాని ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని.. కేసీఆర్ లేఖలో పేర్కొనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కంటే ఎక్కువగా పన్నులు వసూలు చేస్తున్న కేసీఆర్.. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.

Advertisement

Next Story