- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సిద్ధార్థ్’ టైటిల్ గెలిస్తే డిజాస్టరే : శిల్పా
హిందీ బిగ్ బాస్ సీజన్ 13.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. 22 మంది హౌస్‌మేట్స్‌తో ప్రారంభమైన ప్రయాణం..140 రోజులు సాగింది. కలర్స్ టీవీలో ప్రసారం అవుతున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో విన్నర్ ఎవరో మరి కొన్ని గంటల్లో తేలనుంది. సెప్టెంబర్ 29, 2019 నుంచి ప్రారంభమైన బిగ్ బాస్ 13 విజేత ఎవరనేది ఫిబ్రవరి 15న రివీల్ కాబోతోంది. గెలిచిన వారికి ఏకంగా కోటి రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు.
విన్నర్ రేసులో సిద్ధార్థ్ శుక్లా ఉండగా, ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్ విన్నర్ శిల్పా షిండే ఈ విషయమై షాకింగ్ కామెంట్స్ చేసింది. సిద్ధార్థ్ విజేతగా నిలిస్తే షోకు విలువ లేకుండా పోతుందని వ్యాఖ్యానించింది. ఆ సైకో విన్ ఐతే షో డిజాస్టర్‌లా మిగిలిపోతుందనీ, ఇంత గొప్ప టైటిల్ సిద్ధార్థ్‌కు దక్కకూడదనే కోరుకుంటున్నాను అని అభిప్రాయపడింది. అంతే కాదు సిద్ధార్థ్ శుక్లాతో కొన్నాళ్లు రిలేషన్ షిప్‌లో ఉన్నానని తనకు కోపం ఎక్కువని, ప్రతి చిన్న విషయానికి నన్ను కొట్టే వాడని చెప్పింది.