- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాయకులే కాదు.. ఓటర్లూ డివైడ్ అయ్యారు : ఒబామా
దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుత రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులే కాకుండా ఓటర్లు సైతం విభజింపబడ్డారని చెప్పారు. సమస్యలు, వాస్తవాలు మరియు విధానాలపై చర్చించకుండా కేవలం ‘అవతలి వ్యక్తిని ఓడించడం’ అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. ప్రస్తుత మీడియా వాతావరణం కూడా దానికి ఎంతో సహాయపడుతోందని స్పష్టంచేశారు.
ఆదివారం సిబిఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ.. మీడియా, టెక్ కంపెనీలతో కలిసి నేటి సమాజంలో ఉన్న సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వాటి పరిష్కారానికి మార్గాలను కనుగొని, కల్పన నుంచి సత్యాన్ని వేరు చేయగలగడం, దానిని నిర్ధారించుకునే ప్రమాణాలను పెంపొందించుకోవాలని సూచించారు. నేటి మీడియా ప్రకృతి దృశ్యం పూర్తిగా మారిపోవడం, దారి పర్యావసనంగా ఓటర్ల అవగాహన కూడా మారిపోయిందన్నారు. అందువల్లే డెమొక్రటిక్ , రిపబ్లికన్ ఓటర్లు చాలా పక్షపాతంతో మారారని తాను అనుకుంటున్నట్లు డెమొక్రటిక్ పార్టీకి చెందిన 59ఏళ్ల మాజీ అధ్యక్షుడు అన్నారు. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ‘దేశం చాలా విభజించబడిందని’ ఒబామా అంగీకరించారు.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ ఛాలెంజర్ జోబైడెన్ మద్దతుదారుల మధ్య రాజకీయ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ఇచ్చే ఫలితాలతో అమెరికాలో దాదాపు సగం మంది మోసపోతారని భావిసున్నట్లు ఒబామా చెప్పుకొచ్చారు. మొన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ ఓటర్లు వేర్వేరు విషయాలపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తంచేశారు. COVID-19 వ్యాప్తిని పరిమితం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వాలని బైడెన్ ఓటర్లు కోరుకోగా, ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించే విధానాన్ని ఇష్టపడ్డారు. ఇక్కడే నాయకులతో పాటు ఓటర్లు కూడా డివైడ్ అయినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు.
అంతేకాకుండా, బైడెన్ తరచూ జాతీయ ఐక్యత, అమెరికా ఆత్మ గురించి మాట్లాడుతుంటే.. ట్రంప్ మాత్రం ఓటర్ల రక్షకుడిగా తనను తాను అభివర్ణించుకుంటున్నాడు. అంతేకాకుండా, డెమొక్రటిక్ గవర్నర్లు నడుపుతున్న రాష్ట్రాల ద్వారా కొవిడ్ సాయం నిలిపివేస్తామని బెదిరించినట్లు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు మాత్రమే కాదు. ఓటర్లు సైతం విభజించబడ్డారు. ఇది ఇప్పుడు ఒక పోటీగా మారింది. ఇక్కడ సమస్యలు, వాస్తవాలు, విధానాల గుర్తింపుకు అంతగా పట్టింపు లేదని.. కేవలం అవతలి వ్యక్తిని ఓడించాలని మాత్రమే పార్టీలు కోరుకుంటున్నాయని తెలిపారు. చాలా రోజుల తర్వాత ఒబామా మీడియా ముందుకు రావడం పట్ల అతని అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే, ప్రస్తుత రాజకీయాలపై మాజీ అధ్యక్షుడి కామెంట్స్ పట్ల అమెరికన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.