కూలీలకు జీతాలు చెల్లించండి సార్… లేకపోతే కథ వేరుంటది

by Sridhar Babu |   ( Updated:2021-08-12 00:27:30.0  )
కూలీలకు జీతాలు చెల్లించండి సార్… లేకపోతే కథ వేరుంటది
X

దిశ, మణుగూరు: అటవీ శాఖ మొక్కల పెంపకం కేంద్రంలో పనిచేస్తున్న కూలీలకు గత నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లిచకపోవడంతో దళిత సంఘ నాయకులు మండి పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల రేంజ్ పరిధిలో గల మొండికుంట మల్లెల మడుగు గ్రామంలో ఉన్న అటవీశాఖ మొక్కల పెంపక కేంద్రంలో పనిచేస్తున్న కూలీలకు గత నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంపై దళితసంఘ నాయకులు బచ్చలకూర వెంకట్ మండిపడ్డారు. గురువారం కూలీలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ… మండలంలోని అటవీశాఖ మొక్కల పెంపకం కేంద్రలో పనిచేసే మహిళలకు, మొక్కలకు నీరు పంపిణీ చేసే కూలీలకు, వాహన డ్రైవర్లకు నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించకపోడం దుర్మార్గమన్నారు. జీతాలు లేక కూలీల బతుకుబండి కష్టమవుతోదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల జీతాలు అటవీశాఖ అధికారులు మింగేసారా…? లేక ప్రభుత్వం చెల్లించలేదా…అనే ఆలోచన కూలీలకు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కూలీల జీతాల విషయాన్ని అధికారులను అడుగుతుంటే మాట దాటేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు మొక్కల పెంపక కూలీలకు జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. లేనిచో పరిస్థితులు వేరే విధంగా ఉంటాయని, అటవీశాఖ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed