పులి దొరికే వరకు విడిచిపెట్టం

by Shyam |
పులి దొరికే వరకు విడిచిపెట్టం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పులి దొరికే వరకు ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం కంది భీమన్న అడవిలో ఎనిమిది మంచెలు ఏర్పాటు చేశామన్నారు. ఆపరేషన్‌లో భాగంగా 40 మంది ప్రత్యేక సిబ్బంది, మహారాష్ట్ర, తెలంగాణ ర్యాపిడ్ యాక్షన్ టీమ్ పనిచేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన నిపుణుల సాయంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు సీఎఫ్‌వో వినోద్ కుమార్ మీడియాకు తెలిపారు.

Advertisement

Next Story