ఎవరూ అడవిలోకి వెళ్లకండి.. డీఎఫ్ఓ లావణ్య హెచ్చరిక

by Shyam |
Forest officials
X

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా వాసులెవరూ పెద్దపులికి హాని తలపెట్టొద్దని, అంతేగాకుండా పులి ఆచూకీ తెలిసేవరకు ఎవరూ అడవిలోకి వెళ్ళకూడదని భూపాలపల్లి అటవీశాఖ అధికారి లావణ్య సూచించారు. మంగళవారం ఆమె ‘‘దిశ’’ రిపోర్టర్‌తో మాట్లాడుతూ.. పెద్దపులి ప్రస్తుతం అడవిలోనే ఉందని, ఎలాంటి అలజడులు చేయకుండా ఉండగలిగితే పులి అడవిగుండా మహారాష్ట్ర అడవిలోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఈ క్రమంలో పులి మహారాష్ట్ర అడవిలోకి వెళ్లే వరకు ఎలాంటి అలజడులు, దానికి హాని తలపెట్టడాలు వంటివి చేయవద్దని తెలిపారు.

ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండ్రోజుల పాటు పశువుల కాపర్లు సైతం అడవిలోకి వెళ్లొద్దని గ్రామాల్లోనే ఉండాలని ఆమె కోరారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అడవి పక్కన ఉన్న పంట పొలాల్లోకి వెళ్లకూడదని సూచించారు. పులి బారినపడి మరణించిన పశువులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుందని, బాధిత రైతులు పశువైద్యాధికారి ద్వారా పోస్టుమార్టం రిపోర్టు తీసుకొని అటవీశాఖ వారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story