- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ దారి… అయ్యేనా జాతీయ రహదారి..?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : మహారాష్ట్రలోని కళ్యాణి-ముంబై నుంచి నిర్మల్ దాకా ఉన్న 61 వ నెంబర్ జాతీయ రహదారి పొడగింపు పనులకు అటవీ అడ్డంకులు ఎదురవుతున్నా యి. జాతీయ రహదారి నిర్మాణ పనులకు సం బంధించి అనుమతి ఇవ్వాల్సిన కేంద్రం.. రి జర్వ్ ఫారెస్ట్ పేరిట పర్మిషన్ ఇవ్వలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ని ర్మల్ జిల్లా కేంద్రం నుంచి జగిత్యాల జిల్లా కేం ద్రంలో నిర్మించాల్సిన జాతీయ రహదారి ప నులు ముందుకు సాగడం లేదు. సుమారు రూ. వంద కోట్ల మంజూరైనప్పటికీ పనులు సాగే పరిస్థితి లేదని, ఇందుకు అటవీ అడ్డంకులే ప్రధాన కారణమని తెలుస్తోంది.
మంజూరై ఏడాది..!
61 వ నెంబరు జాతీయ రహదారి పొడగింపు పనులు మంజూరై ఏడాది దాటింది. ఇప్పటికే ఉన్న ముంబాయి- కళ్యాణ్ నిర్మల్ జాతీయ ర హదారిని ఖానాపూర్ నియోజకవర్గం మీదుగా జగిత్యాల జిల్లా కేంద్రం వరకు పొడగిస్తూ నాలుగు లైన్ల రహదారి నిర్మించేందుకు నిధులు మంజూరు అయ్యాయి. ఇందుకు సం బంధించి రెండు ప్యాకేజీలు ఖరారు చేయగా, రూ. వంద కోట్లను మంజూరు చేశారు. వాటిని భూసేకరణ తోపాటు అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చే యాల్సి ఉంది. ఇప్పటికే భూసేకరణ దాదాపు పూర్తయినప్పటికీ మరికొంత భాగం భూసేకర ణ అడ్డంకులు ఉన్నాయి. ఇక మిగిలిన ప నుల కు అటవీ అడ్డంకులు ఎదురవుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.
అడ్డంకులు తొలగితేనే..!
జాతీయ రహదారి పొడగింపు పనులకు సం బంధించి అటవీ అడ్డంకులు ప్రధాన అవరోధంగా మారుతున్నాయి. నిర్మల్ నుంచి జగి త్యాల దాకా ఈ రహదారి విస్తరణ పనులకు సుమారు 15 కిలోమీటర్ల మేర రిజర్వు ఫారెస్ట్ నిబంధనలను అడ్డంకిగా మారుతున్నాయి. మామడ అటవీ రేంజ్ పరిధిలో ఈ సమస్య ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. మ రోవైపు కొంత భూసేకరణ సమస్య కూడా ని ర్మాణ పనులకు సమస్యగా మారింది. ఈ స మస్యను నిరోధించేందుకు అధికార వర్గాలు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఎప్పుడో ఏడాది కింద మంజూరైన ఈ ర హదారి పనులు ముందుకు సాగకపోవడం పై అన్ని వర్గాల్లో నిరాసక్తత నెలకొంది.
చర్యలు తీసుకుంటున్నాం..
నిర్మల్ నుంచి జగిత్యాల వరకు విస్తరించాల్సిన జాతీయ రహదారి పనులకు కొన్ని అడ్డంకులు ఉన్న మాట నిజమే. ఈ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రహదారి విస్తరణ పనులకు నిధుల కొరత లేదు. భూసేకరణ, అటవీ సమస్యలు ఉన్నాయి. త్వరలోనే పరిష్కరించి నిర్మాణ పనులు చేపడుతాం. -సుభాష్, డీఈ, జాతీయ రహదారుల శాఖ
slug: Forest obstacles to the extension of National Highway 61
tags: Kalyani-Mumbai, National Highway 61, Nirmal National Highway, Adilabad Forest