- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటరు జాబితాలో అవకతవకలు !
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల నిమిత్తం వార్డుల వారీగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని, వెంటనే ఓటర్లను సక్రమంగా కేటాయించాలని ఎన్నికల సంఘం కమిషనర్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నర్స్ బుధవారం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఫోరంఫర్ గుడ్ గవర్నర్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ వ్యాప్తంగా 150డివిజన్లలో మొత్తం 74.04 లక్షలు ఓటర్లు ఉంటే, చట్ట ప్రకారం సగటున వార్డుల వారీగా 48,360 ఓటర్లను విభజించాలని, కానీ.. ఈనెల 7వ తేదీన విడుదల చేసిన ఓటరు జాబితాలో 10వార్డులకు మాత్రమే ఓటర్ల విభజన సక్రమంగా ఉందన్నారు. మిగతా 140డివిజన్లకు వార్డులలో ఓటర్లు ఉండాల్సిన దానికంటే తక్కువ గానీ, ఎక్కువ గానీ ఉన్నారన్నారు.
మైలార్‌దేవ్‌పల్లి (59)వార్డులో 79,290 ఓటర్లు ఉండగా, రామచంద్రాపురం (112)వార్డులో 27,831 ఓటర్లను మాత్రమే కేటాయించారని అన్నారు. చట్ట ప్రకారం ప్రతి వార్డులో అసాధారణ పరిస్థితుల్లో 10శాతం ఎక్కువ, తక్కువతో వార్డుల విభజన జరగాలన్నారు. ఈ ప్రకారం ఒక్కో డివిజన్ కు 45వేల నుంచి 55వేల మధ్య ఓటర్లు ఉండాలన్నారు. కానీ, గత ఎన్నికలలో ఇదే ఓటరు జాబితా ఉన్నా.. నాటి నుంచి నేటి దాకా ఐదేండ్ల సమయం ఉన్నా.. ప్రస్తుతం నగర పాలక సంస్థ అధికారులు ఆ తప్పును సరిదిద్దుకోకుండానే మళ్లీ అదే తప్పు చేస్తున్నారని విమర్శించారు.