అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఆన్‌లైన్ గండం !

by vinod kumar |
అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఆన్‌లైన్ గండం !
X

వాషింగ్టన్: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కారు భారీ షాక్ ఇచ్చే ప్రకటన చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా యూనివర్సిటీలు కేవలం ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలని నిర్ణయిస్తే ఆ వర్సిటీ విదేశీ విద్యార్థులందరూ స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకటించింది. అటువంటి విద్యాసంస్థల్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకూ వీసా జారీ చేయబోమని స్పష్టం చేసింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్-1, ఎం-1లపై ఇప్పుడు అమెరికాలో ఉండి, ఆన్‌లైన్ క్లాసులు వింటున్నవారు తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని తెలిపింది. భౌతికంగా హాజరయ్యే కాలేజీల్లో చదువే విద్యార్థులు మాత్రమే ఇక్కడ ఉండాలని పేర్కొంది. ఈ నిబంధనలు పాటించకుంటే తదుపరిగా తీసుకునే చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Advertisement

Next Story