- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బలవంతంగానైనా కరోనా వైద్యం: ఏపీ ప్రభుత్వం
ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టనుంది. కరోనా లక్షణాలు కనిపిస్తే బలవంతంగా అయినా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 1897 నాటి చట్టాన్ని వెలికి తీయనుంది.
‘ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్’ను అమల్లోకి తెచ్చినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యక కార్యదర్శి కేఎస్ జవహర్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్ వద్ద సూచనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా భయంతో వైద్యం తీసుకుంటున్న 55 మంది శాంపిళ్లను పరీక్షలకు పంపగా 47 మందికి కరోనా సోకలేదని నిర్ధారణ అయిందని ఆయన వెల్లడించారు.
మరో 8 మంది ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. తిరుపతి స్విమ్స్, విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కరోనా చికిత్సకి ఏర్పాట్లు చేశామన్నారు. విజయవాడలో కరోనా ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. రైల్వే విమానాశ్రయాధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఏపీలోని ప్రతి విమానాశ్రయంలో కరోనా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి నిర్బంధ వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టనున్నామని ఆయన తెలిపారు.
Tags: carona, ap government, 1897 act, epidemic disease act,