అక్కడ బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయి : కిషన్ రెడ్డి

by Shamantha N |
అక్కడ బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయి : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో బలవంతపు మతమార్పిడులపై ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సిక్కు మహిళలను తుపాకులతో బెదిరించి మతమార్పిడులకు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో కశ్మీరీ పండిట్ల విషయంలో కూడా ఇలాగే జరిగిందని గుర్తుచేశారు. దీనిపై కేంద్రం, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించారు. సిక్కు మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా చూస్తామని అన్నారు.

Next Story

Most Viewed