- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురానున్న పోకో!
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది జియోమీ నుంచి ప్రత్యేక సంస్థగా బయటకొచ్చిన పోకో, భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది మరిన్ని స్మార్ట్‌ఫోన్, సంబంధిత ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను తీసుకురావడంపై దృష్టి పెట్టినట్టు వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో ఆన్‌లైన్ ద్వారా విక్రయించే యూనిట్ల పరంగా షియోమీ, శాంసంగ్ తర్వాత మూడో స్థానంలో ఉన్న పోకో తక్కువ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తున్నప్పటికీ, ఉత్తమమైన ఖరీదైన ఫీచర్లతో మార్కెట్లో కొనసాగుతోంది.
‘2020లో కరోనా మహమ్మారి కారణంగా సవాళ్లు ఉన్నప్పటికీ గణనీయమైన వృద్ధిని సాధించాం. ఇది ఎంతో ప్రోత్సాహరం. ఇతర కంపెనీలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ నవంబర్‌లో ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో మూడో స్థానంలో ఉన్నామని’ పోకో ఇండియా డైరెక్టర్ అనుజ్ శర్మ తెలిపారు. ఈ ఏడాది కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో తమ పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటామని, మరింత వ్యూహాత్మకంగా కొనసాగుతామని అనుజ్ పేర్కొన్నారు. అయితే, పోకో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల గురించి అనుజ్ శర్మ స్పందించలేదు. ‘తమ లక్ష్యం రూ. 20 వేల కంటే తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను కస్టమర్లకు అందించడం. అంతేకాకుండా గతేడాది కంటే బలమైన పోర్ట్‌ఫోలియోను పొందాలనుకుంటున్నాం. డిమాండ్‌ను సైతం మెరుగుపరుచుకుంటామనే నమ్మకం ఉందని’ ఆయన వెల్లడించారు.