RIL-ఫ్యూచర్ గ్రూప్ డీల్‌.. జెఫ్ బెజోస్‌కు వర్తక సంఘాల లేఖ

by Harish |
RIL-ఫ్యూచర్ గ్రూప్ డీల్‌.. జెఫ్ బెజోస్‌కు వర్తక సంఘాల లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెజాన్ అధినేత, సీఈఓ జెఫ్ బెజోస్‌కు దేశీయ ఎఫ్ఎంసీజీ కంపెనీల వర్తక సంఘాలు రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంపై లేఖ రాశాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీల్లోని వివిధ డీలర్లు, పంపిణీ దారులను కలిగిన ప్రభుత్వేతర సంస్థ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్(ఏఐసీపీడీ) ఈ మేరకు రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి అడ్డంకులను సృష్టించవచ్చని కోరింది. గత కొంతకాలంగా ఈ ఒప్పందంపై చట్టపరమైన వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని, అమెజాన్ అనవసరమైన రాధాంతం చేస్తోందని, దీనివల్ల ఎంతోమంది వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురవుతున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

2020, మార్చి నుంచి ఫ్యూచర్ గ్రూప్ వద్ద 6,000కు పైగా చిన్న వ్యాపారులకు సంబంధిచిన రూ. 6 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రపంచంపై గుత్తాధిపత్యానికి మీరు ఆడుతున్న ఆటలో తామంతా బలవుతున్నామని అన్నారు. ఆర్థికపరమైన ఒత్తిడితో పాటు మానసిక, భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు వారు వాపోయారు. ఈ సమస్య నుంచి బయటకు వెళ్లంది, లేదా తమకు ఆర్థికంగా చెల్లింపులు చేయమని లేఖలో స్పష్టం చేశారు. కాగా, ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్‌కు 49 శాతం వాటా ఉంది. రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య ఒప్పందం తమకు ఇష్టం లేదంటూ, తమ అంగీకారం లేకుండా జరిగిన ఈ ఒప్పందంపై కోర్టుకు వెళ్లింది. దీనిపై ఫ్యూచర్ గ్రూప్ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో వర్తకుల సంఘటం తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఈ వ్యవహారం నుంచి దూరం జరగాలని జెఫ్ బెజోస్‌కు కోరాయి.

Advertisement

Next Story

Most Viewed