సింగూర్‎కు జలకళ..!

దిశ, ఆందోల్: గత రెండు, మూడు రోజులుగా ఎగువన కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో సింగూరు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. వారం రోజుల క్రితం ప్రాజెక్టులు మూడు టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 9 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, వరద ఉధృతి పెరుగుతుండడంతో 12 టీఎంసీల వరకు నీటి మట్టం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ రామస్వామి తెలిపారు.

వరదలు పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాలకు రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు ఈఈ రామస్వామి సూచించారు. సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement